ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంపై ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము ఇన్ని మంచి పనులు చేసినా ఓటమి తప్పలేదని, కోట్ల మంది ప్రజల ఆప్యాయత ఏమైందో తెలియడం లేదంటూ ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. ఏం జరిగిందో దేవుడికి తెలుసని, తాను చేయగలిగింది ఏమీ లేదని అన్నారు. ప్రజల తీర్పును స్వీకరిస్తామని, కానీ, ప్రజలకు మంచి చేయడానికి వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటామన్నారు. చదువులో ఎన్నడూ లేనంత మార్పులు తీసుకొచ్చాం. అమ్మఒడితో కోటి 53 లక్షల మందికి మంచి చేశాం. మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి భావిస్తూ ఏకంగా 99 శాతం వాగ్దానాలు అమలు చేశాం. నా ప్రతి కష్టంలో తోడుగా, అండగా నిలబడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, వాలంటీర్‌కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన స్టార్ క్యాంపెయినర్‌కు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మళ్లీ కచ్చితంగా ఇక్కడి నుంచి లేస్తాం. ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిల్చుంటాం. ఈ ఐదు సంవత్సరాలు తప్ప, నా రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలో గడిపా. రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలను భరించా. ఇప్పుడు అంతకన్నా ఏమన్నా ఎక్కువ కష్టాలు పెట్టినా, భరించేందుకు సిద్ధంగా ఉన్నా. గవర్నమెంట్‌లోకి వచ్చిన వారికి అభినందనలు'' అని జగన్ అన్నారు.
మంచి పనులు చేసినా ఓటమి తప్పలేదు !
الثلاثاء، 4 يونيو 2024
Andhra Pradesh ఏం జరిగిందో దేవుడికి తెలుసని కోట్ల మంది ప్రజల ఆప్యాయత ఏమైందో తెలియడం లేదంటూ భావోద్వేగం మంచి పనులు చేసినా ఓటమి తప్పలేదు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ليست هناك تعليقات:
إرسال تعليق