ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా కలిశాడు. మోడీ బ్లెస్సింగ్స్ ని అందుకునేలా పవన్ చేశాడు. ఇప్పుడు జాతీయ ఛానల్స్ లోనూ అకీరా కనిపిస్తున్నాడు. అకీరానందన్ గత కొంత కాలంగా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఏదో బయట ఈవెంట్లు, థియేటర్లలో హడావిడిగా ఫోటోలకు దొరకడం తప్ప తన లుక్స్ పూర్తిగా ఎలా ఉంటాయనే అవగాహన సామాన్య ప్రేక్షకుల్లో లేదు. పవన్ కళ్యాణ్ కూడా ఏనాడూ తన సినిమా వేడుకలకు అదే పనిగా తీసుకొచ్చింది లేదు. కానీ జనసేన అఖండ విజయం సాధించాక అకీరాను ప్రత్యేకంగా మీడియాలో హైలైట్ అయ్యేలా తమ వెంట తీసుకెళ్తున్నాడు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చినప్పుడు కొడుకుని పరిచయం చేయడమే కాక కాళ్లకు మొక్కించి ఆశీర్వాదం ఇప్పించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
Post a Comment