రుషికొండ ప్యాలెస్‌ అమ్మినా, లీజుకు ఇచ్చిన నన్ను సంప్రదించండి !


రుషికొండ ప్యాలెస్‌ అమ్మినా, లీజుకు ఇచ్చిన తనకు కావాలని ఢిల్లీ తీహార్ జైల్ లో నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ కోరడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఢిల్లీ తిహార్ జైల్ లో నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశాడు. ఈ మేరకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ ప్రకారం రుషికొండ ప్యాలెస్‌ అమ్మినా, లీజుకు ఇచ్చిన మొదటే నన్నే సంప్రదించండి. మార్కెట్ రేటు కంటే 20 శాతం ఎక్కువ చెల్లిస్తా. చెన్నై, గోవా, దుబాయి, బార్సిలోనాలో నాకు హోటల్స్, బిజినెస్ లు ఉన్నాయి. నా వ్యాపారాలన్నీ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. రుషికొండ ప్యాలెస్ ఇస్తే విజయవంతగా నడిపిస్తా. విశాఖతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. నా బాల్యం విశాఖలో గడిచింది. మా అమ్మమ్మది విశాఖనే. నాపై ఉన్న కేసులు ఆరోపణలు మాత్రమే. ఒక్క కేసు కూడా రుజువు కాలేదు' అంటూ రాసుకొచ్చాడు.

Post a Comment

0 Comments