పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రంజన్ ఛౌదరి తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ పేలవమైన పనితీరుకు గల కారణాలపై పీసీసీ సమావేశంలో సమీక్ష నిర్వహించిన అనంతరం అధీర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీని ఆమోదంపై పార్టీ అధిష్ఠానం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. బహరంపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు గెలుపొందిన అధీర్.. ఇటీవల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దూకుడుగా వ్యవహరించిన ఆయన.. బెంగాల్‌లో ఇతర పార్టీలతో కాంగ్రెస్ పొత్తుపైనా పార్టీ అధిష్ఠానంతో విభేదించారు. ఇలా ఆయన తీరు రాష్ట్రంలో అధికార తృణమూల్-కాంగ్రెస్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణకు కారణమయ్యిందనే వాదన ఉంది. చివరకు రాష్ట్రంలో ఒకే ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పరిమితమైంది.
0 Comments