ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రి నందలపాడు లో ఇంటిపై నిద్రిస్తున్న లాలు భాష (23) అనే టీడీపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. తాడిపత్రి నందలపాడు లో మెకానిక్ షాపులో పనిచేస్తున్న లాలు భాష అనే యువకుడు తన ఇంటి పై నిద్రిస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. లాలు భాష గతంలో కొన్ని కేసులలో నిందితుడుగా ఉన్నారు. పాత కక్షలు కారణంగా హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. తాడిపత్రి డీఎస్పీ జనార్దన్ నాయుడు, పట్టణ సీఐ నాగేంద్రప్రసాద్ సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుని తండ్రి మహబూబ్ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తాడిపత్రిలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య !
الاثنين، 17 يونيو 2024
Andhra Pradesh Criem ఇంటిపై నిద్రిస్తున్న లాలు భాష గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి తాడిపత్రిలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య
ليست هناك تعليقات:
إرسال تعليق