ఢిల్లీలోని సరితా విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో తాజ్ ఎక్స్‌ప్రెస్ లో మూడు బోగీల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రైల్వే డీసీపీ కెపిఎస్ మల్హోత్రా వివరాల ప్రకారం.. సాయంత్రం 4.41 గంటలకు రైలులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిందన్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసి ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఇతర కోచ్‌లకు వెళ్లడం, రైలు దిగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.
తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో మూడు బోగీల్లో మంటలు !
الاثنين، 3 يونيو 2024
national New Delhi తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో మూడు బోగీల్లో మంటలు ప్రయాణికులు ఇతర కోచ్‌లకు వెళ్లడం రైలు దిగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు సాయంత్రం 4.41 గంటలకు రైలులో మంటలు చెలరేగినట్లు సమాచారం
ليست هناك تعليقات:
إرسال تعليق