ఉత్తర ప్రదేశ్‌లోని మహోబా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 30 ఏళ్ల జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ తన ల్యాప్ టాప్‌లో పనిచేస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా తన కుర్చీపై కుప్పకూలిపోయాడు. పక్కన కూర్చున్న అతని సహచరులు ఇతరులను అప్రమత్తం చేసి, అతన్ని అతని డెస్క్ నుండి బహిరంగ ప్రదేశంలోకి మార్చారు. వారు అతని ముఖం మీద నీరు చల్లి, మేల్కొలిపే ప్రయత్నం చేశారు. యువకుడికి సీపీఆర్ ఇచ్చేందుకు సైతం యత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే యువకుడు బ్యాంక్‌లో కుప్పకూలిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
గుండెపోటుతో బ్యాంక్‌లోనే కుప్పకూలిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జనరల్ మేనేజర్ !
الأربعاء، 26 يونيو 2024
national uttara pradesh గుండెపోటుతో బ్యాంక్‌లోనే కుప్పకూలిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జనరల్ మేనేజర్ ల్యాప్ టాప్‌లో పనిచేస్తూ వీడియో నెట్టింట్లో వైరల్
ليست هناك تعليقات:
إرسال تعليق