రేపు రిలీజ్ కానున్న ప్రభాస్ కల్కి 2898AD సినిమా అదనపు షోకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఐదు షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం రేపు ఉదయం 4.30 గంటల నుంచి 8 గంటలలోపు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో మరో షో వేసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. చిత్ర నిర్మాతల విజ్ఞప్తితో భారీ రద్దీ, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.కాగా ఈ చిత్రం లో అమితాబ్, కమల్‌హాసన్, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన ట్రైలర్ ,పోస్టర్స్, గ్లింప్స్‌లకు మంచి స్పందన వచ్చింది.
కల్కి 2898AD సినిమా అదనపు షోకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి !
الأربعاء، 26 يونيو 2024
Andhra Pradesh cinema ఉదయం 4.30 గంటల నుంచి 8 గంటలలోపు మరో షో కల్కి 2898AD సినిమా అదనపు షోకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి
ليست هناك تعليقات:
إرسال تعليق