పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) అనారోగ్యంతో ఆదివారం మణుగూరులోని తన నివాసంలో మృతి చెందారు. సకిని రామచంద్రయ్య గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఆదివాసీ దేవతలైన సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్రను కంచు మేళం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన సకిని రామచంద్రయ్యకు కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. పద్మ శ్రీ రామచంద్రయ్యకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. కోటి నగదుతో పాటుగా ఇంటి స్థలాన్ని ప్రకటించింది. అయితే రామచంద్రయ్యకు ప్రకటించిన నగదు పారితోషికం ఇప్పటికీ అందలేదు. పైగా ఇంటి స్థలం పత్రాలు కూడా ఇవ్వలేదు. వయస్సు రీత్యా రామచంద్రయ్య ఆరోగ్యం క్షీణించడంతో, వైద్య ఖర్చుల నిమిత్తం ఆదుకోవాలని ఇటీవల మంత్రి సీతక్కను కలిసి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ప్రకటించిన పారితోషికాన్ని అందించాలని కోరారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కన్నుమూత
الأحد، 23 يونيو 2024
telangana పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కన్నుమూత సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్రను కంచు మేళం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన సకిని
ليست هناك تعليقات:
إرسال تعليق