కొలెస్ట్రాల్ ను నియంత్రించే అవిసె గింజలు, దాల్చిన చెక్క ?


రీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పటికప్పుడు తగ్గించుకుంటుండాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముందుగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కొన్ని ఆహార పదార్ధాలు డైట్‌లో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. కొలెస్ట్రాల్ కారణంగా రక్తం గుండె వరకూ చేరడంలో ఇబ్బంది తలెత్తి గుండె వ్యాధులు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా రెండు పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలంటారు వైద్య నిపుణులు. రోజూ క్రమం తప్పకుండా ఈ రెండు పదార్ధాలు తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ వేగంగా తగ్గుతాయి. కేవలం కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా ఆరోగ్యపరంగా ఇంకా చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. మన వంట గదిలో లభించే దాల్చిన చెక్క అద్భుతమైన ఔషధమనే చెప్పాలి. దాల్చిన చెక్క రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో హై కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ముందుగా దాల్చిన చెక్కను పౌడర్‌గా చేసుకుని భద్రపర్చుకోవాలి. రోజూ ఉదయం లేచినవెంటనే చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ తీసుకోవాలి. చిటికెడు మించి తీసుకోకూడదు. ఎందుకంటే స్వభావరీత్యా వేడి చేస్తుంది. మరో అద్బుతమైన పదార్ధం అవిసె గింజలు. ఈ సీడ్స్ తీసుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తగ్గించడంలో అవిసె గింజలు అద్బుతంగా పనిచేస్తాయి. ఈ విత్తనాలను మిక్సీలో పౌడర్‌గా చేసుకుని ఉంచుకోవాలి. రోజూ ఉదయం ఓ గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ ఫ్లక్స్ సీడ్స్ పౌడర్ కలుపుకుని తాగుతుండాలి. 

Post a Comment

0 Comments