జూన్‌ 30న 111వ ఎపిసోడ్‌తో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసే రేడియో ప్రసంగం 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమం పునఃప్రారంభం అవుతుందని ప్రధాని మోడీ స్వయంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆలోచనలు, సూచనలు పంచుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. ''ఎన్నికల కారణంగా కొన్ని నెలల విరామం తర్వాత 'మన్‌ కీ బాత్‌' మళ్లీ రానుందని చెప్పడం సంతోషంగా ఉంది. జూన్‌ 30న ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. ఇందుకు మీ ఆలోచనలు, సూచనలను పంచుకోవాలని పిలుపునిస్తున్నా. MyGov ఓపెన్‌ ఫోరమ్‌, NaMo యాప్‌ లేదా 1800 11 7800 ఫోన్‌ నంబర్‌ ద్వారా పౌరులు తమ అభిప్రాయాలను పంచుకోవాలి'' అని ఎక్స్‌ వేదికగా ప్రధాని మోడీ సూచించారు.




Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ