ముకేశ్ అంబానీ ఇంట పెళ్లివేడుకలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న తరుణంలో ఈ సంబరాలు ప్రారంభం అవుతున్నాయి. జూన్ 29న పూజా కార్యక్రమంతో వీటిని ఆరంభించనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అనంత్-రాధిక పెళ్లి టాపిక్ కొద్దికాలంగా వార్తల్లో నిలుస్తోంది. 2022లో అధికారికంగా ఇరు కుటుంబాలు వీరి వివాహాన్ని ధ్రువీకరించాయి. 2023 జనవరిలో నిశ్చితార్థం జరిగింది. ఇక ఏడాది ప్రారంభం నుంచి రెండుసార్లు ప్రీవెడ్డింగ్ వేడుకలు జరిగాయి. మార్చి నెలలో గుజరాత్‌లోని జామ్ నగర్‌లో మొదటిసారి ముందస్తు వివాహ వేడుకల్ని నిర్వహించారు. దానికి అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు హాజరయ్యారు. దాంతో జామ్ నగర్ పేరు మారుమోగింది. తర్వాత మే 29 నుంచి జూన్ ఒకటివరకు సెకండ్ ప్రీవెడ్డింగ్ జరిగింది. ఈసారి మధ్యధరా సముద్రంలోని ఒక క్రూజ్ షిప్‌లో అతిథులకు ఐరోపా స్టైల్ ఆతిథ్యం రుచిచూపించారు. ఆ సమయంలోనే వారి పెళ్లి కార్డు వైరల్ అయింది. జూన్ 29న ముంబయిలోని ముకేశ్ నివాసం ఆంటీలియాలో నిర్వహించనున్న పూజా కార్యక్రమంతో వారి వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. జులై 12న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి పెళ్లి జరగనుంది. జులై 14న అతిథులకు విందు ఇవ్వనున్నారు. దీనికి పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రముఖ డిజైనర్లు వివాహ దుస్తుల్ని డిజైన్ చేసే పనిలో ఉన్నారు.
జూన్ 29 నుంచి అనంత్-రాధిక వివాహ వేడుకలు !
الثلاثاء، 18 يونيو 2024
business national చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ జాతీయ మీడియా కథనాలు జూన్ 29 నుంచి అనంత్-రాధిక వివాహ వేడుకలు
ليست هناك تعليقات:
إرسال تعليق