ఎన్డీయే ప్రభుత్వం ఉజ్వల యోజన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా రూ.300 రాయితీ ప్రకటించింది. మరో 9 నెలల పాటు ఈ సబ్సిడీని అందించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉజ్వల యోజన ద్వారా అందిస్తున్న రూ.300 రాయితీని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవల 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పుడు 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.300 రాయితీని కొనసాగించేందుకు నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయాన్ని పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల్లో ప్రజల ఆగ్రహం గుర్తించిన మోదీ ప్రభుత్వం వారి ఆగ్రహం చల్లార్చే పనిలో మునిగింది. ఇకపై పేదలకు సంక్షేమం అందించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ప్రజలకు వరుసగా శుభవార్తలు అందించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే రూ.300 సబ్సిడీ అందించనుందని తెలుస్తోంది. ఒక కుటుంబానికి 12 రాయితీ సిలిండర్లు అందనున్నాయి. అయితే ఈ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌పీజీ సిలిండర్ రాయితీ కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ రాయితీ కొనసాగే అవకాశం ఉంది. అనంతరం దీనిని పొడిగించాలా లేదా అనేది భవిష్యత్‌లో నిర్ణయం తీసుకుంటారు. 2016లో ప్రారంభించిన ఉజ్వల పథకం కింద ఇప్పటివరకు 10 కోట్ల కుటుంబాలకు కేంద్రం సిలిండర్లు అందించింది.
ఉజ్వల యోజన గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ ?
الاثنين، 24 يونيو 2024
national ఉజ్వల యోజన గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ ? ప్రకటన వెలువడే అవకాశం మరో 9 నెలల పాటు ఈ సబ్సిడీని అందించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆమోదం
ليست هناك تعليقات:
إرسال تعليق