ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 26 నుంచి 11 రోజుల పాటు వారాహి విజయ దీక్ష చేపట్టనున్నారు. ఈ సమయంలో ఆయన పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకుంటారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఏడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి ఆధ్యాత్మిక ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జూన్ లో వారాహి విజయయాత్రను ప్రారంభించి వారాహి అమ్మవారికి పూజలు, ఆ తర్వాత దీక్ష చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అమ్మవారి ఆశీస్సులు పొందేందుకే పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26న ప్రారంభమయ్యే దీక్ష 11 రోజుల పాటు కొనసాగుతుందని, ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ