బీహార్‌లో సోమవారంనాడు జరిగిన ఎన్నికల సభలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సభా వేదికలోని కొంత భాగం కిందకు కృంగిపోవడంతో ఆయన అడుగులు తడబడ్డాయి. అయితే వెంటనే నిలదొక్కుకోవడంతో భద్రత సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గంలోని పాలిగంజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి వేదిక పైకి తీసుకువెళ్తుండగా వేదికలోని ఒక భాగం కిందకు కృంగిపోయింది. దీంతో బ్యాలెన్స్ కోసం రాహుల్ కొద్దిసేపు తడబడ్డారు. వెంటనే ఆ విషయం గ్రహించిన మిసాభారతి ఆయన చేయి పట్టు నిలదొక్కుకునేందుకు సహకరించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బందిని రాహుల్ ఫరవాలేదంటూ వారించడం, ఆ వెంటనే రాహుల్ నవ్వుతూ వేదికపై నుంచి సభికులకు చేయి ఊపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పాటలీపుత్ర లోక్‌సభ సీటు నుంచి మిసా భారతి పోటీ చేస్తున్నారు.
రాహుల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం !
الاثنين، 27 مايو 2024
bihar national ఆయన అడుగులు తడబడ్డాయి రాహుల్‌కు తృటిలో తప్పిన ప్రమాదం సభా వేదికలోని కొంత భాగం కిందకు కృంగిపోవడంతో
ليست هناك تعليقات:
إرسال تعليق