హైదరాబాద్ లోని గాజుల రామారం సర్కిల్‌లో శానిటేషన్ ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కిషన్ కిందిస్థాయి కార్మికురాలిపై కన్నెశాడు. తన కోరిక తీర్చుకోవాలనుకున్న అతను.. తాను పై అధికారి అనే అస్త్రాన్ని ఉపయోగించాడు. రోజు పనికి వచ్చిన ఆమెను గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేసి ఆమెను లొంగదీసుకున్నాడు. అంతటితో ఆగకుండా తనతో ప్రైవేట్‌గా ఉన్న వీడియోలు తీసి బెదిరింపులకు గురిచేశాడు. తన మాట వినకపోతే ఉద్యోగంలో ఇబ్బందులు తప్పవని భయపెట్టాడు. దాంతో చేసేదేమీ లేక ఎవరికీ చెప్పుకోలేక ఆ కార్మికురాలు తీవ్ర మనోవేదనను అనుభవించింది. అయితే కిషన్ ఫోన్‌లో ఉన్న వీడియోలు తోటి కార్మికుల చేతుల్లోకి వెళ్లడంతో వారంతా అతన్ని ప్రశ్నించారు. దీంతో విషయం బయటకి పొక్కకుండా ఉండేందుకు ఒక్కొక్కరికి పది వేల రూపాయలు ఇచ్చి 14 మంది కార్మికుల నోరు మూయించినట్టు తెలుస్తోంది.
పారిశుధ్య కార్మికురాలిపై శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ అఘాయిత్యం ?
الخميس، 23 مايو 2024
hyderabad telangana గాజుల రామారం సర్కిల్ తనతో ప్రైవేట్‌గా ఉన్న వీడియోలు తీసి బెదిరింపులు పారిశుధ్య కార్మికురాలిపై శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ అఘాయిత్యం ?
ليست هناك تعليقات:
إرسال تعليق