ఆటోను ఇంటి పైకి ఎక్కించేసిన డ్రైవర్ ?


ఇంతకాలం తన కుటుంబాన్ని పోషించిన ఆటోను పాతదైపోయిందని వదిలేయకుండా ఆ ఆటో డ్రైవర్ ఏకంగా ఆటోను తన ఇంటి పైకి చేర్చి అందరికీ కనపడేలా పెట్టాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కంటి ముందర ఉండే తల్లిదండ్రులను మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఆటో డ్రైవర్ ఉండడంతో నెటిజెన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా రోజుల నుండి తనతో పాటు తన కుటుంబానికి అన్నం పెట్టిన ఆటో తనను ప్రయోజకుడ్ని చేసిందని అందుకు తాను ఆటోకు కృతజ్ఞత చూపించాలని ఈ పని చేసినట్లు తెలిపాడు. అంతేకాకుండా తనకి ఓ సొంతింటి కల కూడా ఉండదని., అందుకోసం ఆటో నడుపుకోవడం వల్లే తాను బ్రతకడమే కాకుండా మరింత డబ్బు కూడగట్టుకుని ఓ ఇల్లు కూడా కట్టుకోవడంతో తన సొంతింటి కల నెరవేడంతో ఆటోను పక్కన పెట్టకుండా అదే ఇంటిపై ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఆటో డ్రైవర్ చేసిన పనికి ప్రస్తుతం సోషల్ మీడియాలో అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. సమాజంలో చాలామంది సొంతవారిని పట్టించుకోవట్లేదని.. నువ్వు నీ ఆటోని కూడా విడిచి పెట్టట్లేదు అంటూ గ్రేట్ అంటూ అతన్ని పొగడ్తలతో ప్రసశంసలను కురిపిస్తున్నారు. 

Post a Comment

0 Comments