పశ్చిమ బెంగాల్ వైపు రెమల్ తుఫాన్ దూసుకొస్తోంది. ఆదివారం బెంగాల్‌లో తీరం దాటనుంది. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. విపత్తును ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రజలను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉంటే తుఫాన్ తీరం దాటేటప్పుడు గంటకు 102 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులను రద్దు చేయాలని కోల్‌కతా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా శనివారం ప్రకటించింది. 21 గంటల పాటు సర్వీసులను నిలిపివేయాలని సూచించింది.
0 Comments