హైదరాబాద్ లోని కుషాయిగూడ సీఐ వీరస్వామి, ఎస్‌ఐ షఫీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా వారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూవివాదానికి సంబంధించి ఓ కేసును సెటిల్‌మెంట్ చేసే విషయంలో కుషాయిగూడ సీఐ, ఎస్‌ఐ బాధితుడిని లంచం అడిగారు. దాంతో బాధితుడికి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సదరు వ్యక్తి వద్ద నుంచి సీఐ వీరస్వామి, ఎస్‌ఐ షఫీతో పాటు కానిస్టేబుల్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత ముగ్గురు పోలీసులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లోనే విచారిస్తున్నారు.
ホーム
/
సీఐ వీరస్వామి
/
ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్‌ఐ !
الجمعة، 31 مايو 2024
hyderabad telangana ఎస్‌ఐ ఎస్‌ఐ షఫీ ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ భూవివాదానికి సంబంధించి ఓ కేసును సెటిల్‌మెంట్ చేసే విషయంలో సీఐ వీరస్వామి
ليست هناك تعليقات:
إرسال تعليق