విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. భవానీదీక్షలు, దసరా నవరాత్రుల తరహాలో రోజుకు సుమారు 50 వేల మంది భక్తులు వస్తున్నారని సమాచారం. మండే ఎండలను లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్ లలో బారులు తీరుతున్నారు. దీంతో రూ.25 లక్షల దాకా టిక్కెట్ల ఆదాయం జమ అవుతోంది. ఎక్కువ శాతం మంది తమ సొంత వాహనాలతో వస్తుండడం వల్ల పార్కింగ్ సమస్య తలెత్తుతుంది. కనకదుర్గానగర్‌లో అభివృద్ధి పనుల కారణంగా పార్కింగ్ స్థలం కొరత ఏర్పడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు ఈవో కేఎస్ రామారావు వెల్లడించారు.
ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి !
الأربعاء، 22 مايو 2024
Andhra Pradesh bakthi ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి మండే ఎండలను లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది
ليست هناك تعليقات:
إرسال تعليق