సార్వత్రిక ఎన్నికల వేళ కలకత్తా హైకోర్టు 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీచర్ రిక్యూట్‌మెంట్ రద్దు చేసిన న్యాయస్థానం.. తాజాగా ఓబీసీ సరిఫికెట్లను రద్దు చేస్తూ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. 2010 తర్వాత జారీ చేసిన సుమారు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. రాష్ట్రంలో ఆయా సర్వీసులకు, పోస్టులకు రిజర్వేషన్ కోసం ఉపయోగించిన సర్టిఫికెట్లు చట్టవిరుద్ధంగా న్యాయస్థానం పేర్కొంది. హైకోర్టు తీర్పును అంగీకరిచండలేదని మమతాబెనర్జీ తేల్చి చెప్పారు. ఈ తీర్పు బీజేపీ ఆదేశానుసారగంగా వచ్చిందని కొట్టిపారేశారు. ఓబీసీ రిజర్వేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇంటింటికి సర్వే చేశాకే బిల్లు రూపొందించినట్లు చెప్పారు. మంత్రివర్గం ఆమోదించాక.. అసెంబ్లీలో బిల్లు పాస్ అయిందని తెలిపారు. తాజా తీర్పు బీజేపీ ఆదేశానుసారంగా వచ్చిందని.. ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని మమత వెల్లడించారు. కోర్టు తీర్పుపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందిస్తూ మమత బెనర్జీపై ధ్వజమెత్తారు. మమత బుజ్జగింపు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. అక్రమంగా ముస్లింలకు మమత ప్రభుత్వం ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేసిందని ఆరోపించారు. హైకోర్టు నిర్ణయం ఆశ్యర్యం కలిగించిందనికాంగ్రెస్ పేర్కొంది. 5 లక్షల మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుందని.. ఓబీసీ కమ్యూనిటీకి ఇది చాలా పెద్ద దెబ్బగా అభివర్ణించింది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని కాంగ్రెస్ సూచించింది.
ホーム
/
కలకత్తా హైకోర్టు
/
2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు : కలకత్తా హైకోర్టు !
الأربعاء، 22 مايو 2024
2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లను national west bengal ఇప్పటికే టీచర్ రిక్యూట్‌మెంట్ రద్దు చేసిన న్యాయస్థానం కలకత్తా హైకోర్టు
ليست هناك تعليقات:
إرسال تعليق