తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీ -వర్క్స్ సీఈవోగా జోగీందర్ తనికెళ్ల, టీ హట్ సీఈవోగా సీతా పల్లచోళ్ల ను నియమించింది. ఈ నేపథ్యంలో ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఈ పదవుల్లో మూడేళ్ల పాటు కొనసాగుతారు. అయితే టీ వర్క్స్ అనేది ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్ వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి పెద్ద ప్రొటో టైపింగ్ కేంద్రం. "ఆలోచనలతో రండి - ఆవిష్కరణలతో వెళ్ళండి" అనే నినాదంతో రూపొందిన టీ వర్క్స్, హార్డ్ వేర్ ఉత్పత్తుల తయారీకి కేంద్రంగా మారింది. టీ హబ్ అనేది యువత కలల సాకార సాధనకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సంకల్పించిన ప్రాజెక్టు. దేశవ్యాప్తంగా స్టార్టప్ లను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ఇదొక సరికొత్త వేదిక.
టీ హబ్ సీఈవో గా జోగీందర్ తనికెళ్ల, టీ హట్ సీఈవోగా సీతా పలచోళ్ళ నియామకం !
الأربعاء، 22 مايو 2024
"ఆలోచనలతో రండి - ఆవిష్కరణలతో వెళ్ళండి" telangana టీ హట్ సీఈవోగా సీతా పలచోళ్ళ నియామకం టీ హబ్ సీఈవో గా జోగీందర్ తనికెళ్ల వీరు ఈ పదవుల్లో మూడేళ్ల పాటు కొనసాగుతారు
ليست هناك تعليقات:
إرسال تعليق