వివిధ ఆన్‌లైన్ లాగిన్‌ అవసరాల కోసం మనం పాస్‌వర్డ్‌లపైనే ఆధారపడతాం. పాస్‌వర్డ్‌లను మించిన సెక్యూరిటీని అందించే ఒక మార్గం అందుబాటులో ఉంది. అదే 'పాస్​ఫ్రేజ్​'. 'ఫ్రేజ్' అంటే పదబందం అని అర్థం. ఇది కొన్ని పదాల కలయిక. ఒక ఎగ్జాంపుల్‌ను పరిశీలిస్తే thats not a big deal అనే ఫ్రేజ్ ఉంది. పాస్ ఫ్రేజ్ తయారీలో భాగంగా మనం దీన్ని లెటర్స్, నంబర్స్​, స్పెషల్ క్యారెక్టర్స్​లోకి మార్చేయాలి. దీనివల్ల thats not a big deal అనే ఫ్రేజ్ 2081#TON127deaL అనే ఫార్మాట్‌లోకి మారిపోతుంది. దీన్నే leetspeak అని పిలుస్తారు. ఇలా క్రియేట్ చేసిన పాస్​ఫ్రేజ్​లో not అనే పదాన్ని TON అని మార్చారు. దీనివల్ల హ్యాకర్ మీ ఫ్రేజ్‌ను కనిపెట్టినా దాన్ని క్రాక్ చేయడం చాలా కష్టతరంగా మారుతుంది. పాస్ ఫ్రేజ్‌ను సెట్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా గుర్తుండే ఫ్రేజ్‌నే ఎంపిక చేసుకోవాలి. కొన్ని వైబ్​సైట్లు పొడవాటి పాస్​వర్డ్​లను సపోర్ట్ చేయవు. అలాంటప్పుడు ఫ్రేజ్‌లోని మొదటి అక్షరాలను తీసుకుని, వాటితో పాస్​ఫ్రేజ్‌ను క్రియేట్ చేసుకోవాలి. పర్సనల్ కంప్యూటర్​లో మనం ఎంత పొడవాటి పాస్​ఫ్రేజ్​ను అయినా టైప్ చేయొచ్చు. కానీ మొబైల్ ఫోన్స్​, ట్యాబ్స్​లో వాటికి సపోర్ట్ లభించకపోవచ్చు. పాస్​వర్డ్ మేనేజర్​ను వాడుకోవడం బెటర్. దీనికి మీరు ఒక మాస్టర్​ పాస్​వర్డ్​ను పెట్టుకుంటే చాలు. అది మీ అన్ని పాస్​వర్డ్​లను సురక్షితంగా ఉంచుతుంది. ప్రస్తుతం పాస్​కీ ఆథెంటికేషన్ అందుబాటులో ఉన్నప్పటికీ.. అందరూ పాస్ వర్డ్‌లపైనే ఆధారపడుతున్నారు. కొంతమంది సింపుల్​గా ఉండే పాస్​వర్డ్‌లు పెట్టి హ్యాకర్లకు దొరికిపోతుంటారు. సైబర్​ నేరగాళ్ల ‘డిక్షనరీ ఎటాక్స్’ సింపుల్‌గా ఉండే పాస్‌వర్డ్‌లను ఇట్టే కనిపెట్టేస్తాయ్. మరికొందరు స్ట్రాంగ్​ పాస్​వర్డ్​లను వాడినా.. అన్ని అకౌంట్లలోకీ అదే ఉపయోగిస్తుంటారు. ఒకవేళ ఫిషింగ్ సైట్లలో మీ పాస్​వర్డ్ ఎంటర్ చేయగానే, దానిని సైబర్ నేరగాళ్లు ఈజీగా కనిపెట్టేస్తారు. ఒకవేళ ప్రతి అకౌంట్​కు వేర్వేరు స్ట్రాంగ్ పాస్​వర్డ్స్​ పెట్టుకుంటే, వాటిని గుర్తుంచుకోవడం కష్టమైపోతుంది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ