ఇండియన్ ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛత్రి సొంత బ్రాండైన ACwO నుండి ACwO FwIT Play స్మార్ట్ వాచ్ విడుదలైంది. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ స్మార్ట్ వాచ్ లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ వాచ్ ను మహిళలకు అవసరమైన అన్ని ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. దీని ధర రు. 3,499. అత్యవసర సమయంలో అవసరమైన SOS ఫీచర్ తో ఈ స్మార్ట్ వాచ్ ని అందించింది. ఒక్క టచ్ తో ఎమర్జెన్సీ కాల్ మొదలుకొని పెద్దగా సైరన్ మోగించడం వంటి పనులు ఇది చేస్తుంది. 24/7 హార్ట్ రేట్ మోనిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ మోనిటరింగ్ మరియు ఫిమేల్ హెల్త్ సైకిల్ వరకు అన్ని పనులు ఇది నిర్వహిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 100+ స్పోర్ట్స్ మోడ్స్ మరియు వాచ్ ఫేస్ లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ను ఆడవారికి తగిన డిజైన్ తో పాటుగా నోటిఫికేషన్ ఫీచర్స్ తో కూడా తీసుకు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. స్మార్ట్ వాచ్ పెద్ద 1.75 ఇంచ్ ఆల్వేస్ ఆన్ Luxury AMOLED డిస్ప్లే కలిగి ఉంది.
మహిళల కోసం ప్రత్యేకంగా ACwO FwIT Play స్మార్ట్ వాచ్ !
Wednesday, May 8, 2024
science smart watch technology ఇండియన్ ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛత్రి సొంత బ్రాండ్ మహిళల కోసం ప్రత్యేకంగా ACwO FwIT Play స్మార్ట్ వాచ్
No comments:
Post a Comment