ఆయిస్టర్ గ్రీన్ హైబ్రిడ్ వన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 82 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్‌ను పొందినట్లు సుజ్లాన్ గ్రూప్ శుక్రవారం తెలిపింది. 26 విండ్ టర్బైన్ జనరేటర్లను సుజ్లాన్ ఏర్పాటు చేయనుంది. ఇవి ఒకొక్కటి 3.15 MW రేట్ సామర్థ్యంతో మధ్యప్రదేశ్‌లోని అగర్ వద్ద ఆయిస్టర్ గ్రీన్ సైట్‌లో ఏర్పాటు చేయనున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒప్పందంలో భాగంగా సుజ్లాన్ విండ్ టర్బైన్స్‌ను సరఫరా చేస్తుంది. కంపెనీ సమగ్ర కార్యకలాపాలు, నిర్వహణ సేవలను కూడా చేపడుతుంది. ఈ ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తారు.
సుజ్లాన్ చేతికి 82 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్!
الجمعة، 31 مايو 2024
26 విండ్ టర్బైన్ జనరేటర్లను సుజ్లాన్ ఏర్పాటు చేయనుంది business national పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తారు విద్యుత్‌ను వాణిజ్య సుజ్లాన్ చేతికి 82 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్
ليست هناك تعليقات:
إرسال تعليق