ఐప్యాడ్‌ ఎయిర్‌ జెన్‌ 6, ఐప్యాడ్‌ ప్రో OLED, పెన్సిల్‌ ప్రో విడుదల !


పిల్‌ Let Loose ఈవెంట్‌ 2024లో ఐప్యాడ్‌ ఎయిర్‌ జెన్‌ 6, ఐప్యాడ్‌ ప్రో OLED, పెన్సిల్‌ ప్రో లాంచ్‌ చేసింది. ఐప్యాడ్‌ ఎయిర్‌ రెండు వేరియంట్లలో వచ్చింది. 11 అంగుళాలు, 13 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ల్యాండ్‌ స్కేప్‌ మోడ్‌లో కెమెరా మరియు స్పీకర్లను కలిగి ఉంది. ఐప్యాడ్‌ ఎయిర్‌ 11 అంగుళాల Wi-Fi వేరియంట్ ప్రారంభ ధర రూ.59,900గా ఉంది. అదే Wi-Fi + సెల్యూలర్‌ మోడల్ ప్రారంభ ధర రూ.74,900గా ఉంది. 13 అంగుళాల ఐప్యాడ్‌ ఎయిర్‌ WI-Fi వేరియంట్ ప్రారంభ ధర రూ.79,900గా ఉంది. మరియు Wi-Fi + సెల్యూలర్ మోడల్‌ ప్రారంభ రూ.94,900 గా ఉంది. మే 15 నుంచి సేల్‌ ప్రారంభం కానుండగా.. ఇవాళ్టి నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఐప్యాడ్‌ ఎయిర్‌ జెన్‌ 6.. 11 అంగుళాల, 13 అంగుళాల వేరియంట్లు లిక్విడ్‌ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. యాంటీ రిఫ్లెక్టివ్‌ స్క్రీన్‌ మరియు ట్రూ టోన్‌ టెక్నాలజీ తో వచ్చింది. ఈ ఐప్యాడ్‌ ఎయిర్ M2 చిప్‌సెట్‌ 10 కోర్‌ GPU. గత మోడల్ కంటే మూడు రెట్లు మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుందని ఆపిల్‌ తెలిపింది. ఐప్యాడ్‌ ఎయిర్‌ జెన్‌ 6.. వెనుక వైపు 12MP కెమెరాను కలిగి ఉంటుంది. మరియు ముందువైపు 12MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాల ద్వారా 4k నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. కనెక్టివిటీ పరంగా వైఫై 6E తోపాటు సెల్యూలర్ కనెక్టివిటిని కలిగి ఉంటుంది.  ఐప్యాడ్‌ ప్రో 2024.. 11 అంగుళాలు మరియు 13 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు మోడళ్లు అల్ట్రా రెటీనా Tandem OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 1600 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ అయింది. డిజైన్‌ పరంగా ఐప్యాడ్‌ ప్రో OLED మోడళ్లు iPadOS 17 పైన పనిచేస్తాయి. 5mm అల్యూమినియం డిజైన్‌తో లాంచ్‌ అయింది. మరియు 3nm M4 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. న్యూట్రల్ ఇంజిన్‌ ద్వారా AI ఫీచర్లను సపోర్టు చేస్తుంది. గరిష్ఠంగా 2TB వరకు సపోర్టు చేస్తాయి. కెమెరా విభాగం పరంగా ఐప్యాడ్ ప్రో 12MP వెనుక కెమెరాను కలిగి ఉంటుంది. అడాప్టిల్‌ సెన్సార్‌ మరియు LiDAR సెన్సార్‌ను కలిగి ఉంది. ముందువైపు 12MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్‌ నాలుగు స్పీకర్లను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా వైపై 6E మరియు బ్లూటూత్‌ 5.3 తో లాంచ్ అయింది. ఐప్యాడ్‌ ప్రో OLED.. 11 అంగుళాల వేరియంట్ ప్రారంభ ధర రూ.99,990 గా ఉంది. 13 అంగుళాల మోడల్‌ రూ.1,29,900 గా ఉంది. మే 15 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ఇవాళ్టి నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి. సిల్వర్‌ మరియు స్పేస్‌ బ్లాక్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.ఇదే ఆపిల్‌ ఈవెంట్‌లో ఆపిల్ పెన్సిల్‌ ప్రోను విడుదల చేసింది. హ్యాప్టిక్‌ ఫీడ్‌బ్యాక్‌తో అందించబడుతుంది. స్క్వీజ్‌, హోవర్‌, బారెల్‌ రోల్ మరియు డబుల్‌ ట్యాప్‌ వంటి గెశ్చర్లను పొందుతుంది. ఫైండ్‌ మై యాప్‌ ద్వారా జతచేయబడి ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.11,900 గా ఉంది. మే 15 నుంచి భారత్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.


Post a Comment

0 Comments