ఉత్తరాధి రాష్ట్రాల్లో వడగాలులు, తీవ్రమైన ఎండలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. పలు రాష్ట్రాల్లో గురువారం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. రాజస్థాన్‌లోని ఫలోదీలో నిన్న 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఆదివారం బర్మర్ సిటీలో 49.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీ సెల్సియస్ నమోదు కాగా, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ నరేశ్ కుమార్ చెప్పారు. రాబోయే మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, వచ్చే నాలుగైదు రోజుల్లో వర్షం పడే సూచనల్లేవని ఆయన చెప్పారు. బుధవారం వరకు ఈ హీట్‌వేవ్ కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
రాజస్థాన్‌లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు !
الأحد، 26 مايو 2024
national weather బర్మర్ సిటీలో 49.8 డిగ్రీల ఉష్ణోగ్రత బుధవారం వరకు ఈ హీట్‌వేవ్ కొనసాగే అవకాశం భారత వాతావరణ శాఖ రాజస్థాన్‌లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ليست هناك تعليقات:
إرسال تعليق