దూర్ దర్శన్ కిసాన్ ఛానల్ తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా మే 26న ఏఐ యాంకర్ సేవలను ప్రారంభించనుంది. ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ లు పరిచయం చేయనుంది. దేశవ్యాప్తంగా సేవలను ప్రారంభించనుంది. న్యూస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలతో యాంకర్ లను కలిగి ఉన్న తొలి ప్రభుత్వ న్యూస్ ఛానల్‌గా డీడీ కిసాన్ గుర్తింపు పొందనుంది. న్యూ్స్ చదివేందుకు నిరంతరం ఈ AI యాంకర్‌ల సేవలను వినియోగించుకుంటామని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వినియోగదారుల ఈ ఏఐ యాంకర్ లు చదివే న్యూస్‌లను చూసే అవకాశం ఉంటుందని తెలిపింది. దేశంలో వ్యవసాయంపై జరిగే పరిశోధనలు మరియు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో వస్తున్న మార్పులు,వాతావరణ సమాచారం, ప్రభుత్వ పథకాలు సహా ఇతర సంబంధిత సమాచారాన్ని ఈ ఏఐ యాంకర్‌ల న్యూస్ బులిటెన్ ద్వారా పొందవచ్చు. ఈ ఏఐ యాంకర్‌లు AI క్రిష్, AI భూమి.. 50 భాషల్లో వార్తలను చదవగలరని తెలుస్తోంది. ఈ డీడీ కిసాన్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం వివిధ కథనాలు, వార్తలను అందిస్తోంది. ఈ ఛానల్ మే 26, 2015 న ప్రారంభం అయింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వ్యవసాయానికి సంబంధించి పూర్తి సమాచారం చేరవేసే లక్ష్యంతో ఈ ఛానల్‌ను ప్రారంభించారు. ఇప్పటికే అనేక ప్రైవేటు మీడియా ఛానళ్లు ఏఐ యాంకర్ లను కలిగి ఉన్నాయి. ఇండియా టుడే ఏఐ యాంకర్ సనాను 2023లో లాంచ్ చేసింది. అదే విధంగా ఒడిశాకు చెందిన OTV ఏఐ న్యూస్ యాంకర్ లిసాను లాంచ్ చేసింది. ఈ లిసా ఒడియా మరియు ఇంగ్లీష్‌లో వార్తలను అందిస్తుంది. న్యూస్18 ఏఐ కౌర్, పవర్ టీవీ ఏఐ యాంకర్ సౌందర్య ఉన్నారు.
మే 26 నుంచి డీడీ కిసాన్ ఛానల్ లో ఏఐ యాంకర్ సేవల ప్రారంభం !
السبت، 25 مايو 2024
national science technology ఏఐ క్రిష్ ఏఐ భూమి తొలి ప్రభుత్వ న్యూస్ ఛానల్‌గా డీడీ కిసాన్ గుర్తింపు మే 26 నుంచి డీడీ కిసాన్ ఛానల్ లో ఏఐ యాంకర్ సేవల ప్రారంభం
ليست هناك تعليقات:
إرسال تعليق