మారుతి సుజుకి ఎస్‌యూవీ, హ్యాచ్ బ్యాక్ తదితర కార్ల సెగ్మెంట్లలో తన స్థానం పదిలం చేసుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఏప్రిల్‌లో కొన్ని మోడల్ కార్లపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. మారుతి సుజుకి ఇగ్నీస్ మోడల్ కారుపై గరిష్టంగా రూ.58 వేల డిస్కౌంట్ ఆఫర్ చేసింది. మారుతి సుజుకి పాపులర్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనోపై రూ.58 వేల డిస్కౌంట్ అందిస్తున్నది. మారుతి సుజుకి సియాజ్ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ.25 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.25 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 కలుపుకుని మొత్తం రూ.53 వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రీడ్ కార్లపై రూ.58 వేలు, స్ట్రాంగ్ హైబ్రీడ్ వర్షన్లపై రూ.84 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఫ్రాంక్స్ టర్బో పెట్రోల్ వేరియంట్ మీద రూ.68 వేల వరకూ ధర తగ్గించింది. మారుతి సుజుకి జిమ్నీ కారుపై గరిష్టంగా రూ.1.50 లక్షల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. 2022-23, 2023-24 మోడల్ కార్లలో స్పెషిఫిక్ ట్రిమ్స్ మీద గణనీయ క్యాష్ డిస్కౌంట్లు అందిస్తున్నది
కొన్ని మోడల్ కార్లపై మారుతి సుజుకి డిస్కౌంట్ ఆఫర్ !
الأحد، 7 أبريل 2024
automobile science technology ఏప్రిల్‌లో కొన్ని మోడల్ కార్లపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ డిస్కౌంట్ కొన్ని మోడల్ కార్లపై మారుతి సుజుకి డిస్కౌంట్ ఆఫర్
ليست هناك تعليقات:
إرسال تعليق