దేశీయ మార్కెట్లో నాయిస్ కొత్త స్మార్ట్ వాచ్ కలర్‌ఫిట్ పల్స్ 4ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ 1.85 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆల్‌వేజ్ ఆన్ డిస్‌ప్లే, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్ నెస్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ వాచ్ ఆపిల్ తరహా డిజైన్‌ను కలిగి ఉంది. నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 4 స్మార్ట్‌వాచ్ 390*450 పిక్సల్ రిజల్యూషన్‌తో 1.85 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో విడుదల అయింది. ఈ వాచ్ ఆల్‌వేజ్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌ను కలిగి ఉంటుంది. Tru Sync తో బ్లూటూత్ 5.3 వెర్షన్‌తో కాలింగ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా స్మార్ట్‌వాచ్ నుంచి కాల్స్‌కు స్పందించవచ్చు. 7 రోజులపాటు బ్యాటరీ లైఫ్ : ఈ స్మార్ట్ వాచ్ నాయిస్ హెల్త్ షూట్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా హార్ట్ రేట్, SpO2, నిద్ర నాణ్యత మరియు ఒత్తిడి వంటి వాటిని పర్యవేక్షిస్తుంది. నాయిస్ బజ్ ఫీచర్ ద్వారా సుమారు 10 కాల్ లాగ్ ను స్టోర్ చేయవచ్చు. సింగిల్ ఛార్జింగ్ ద్వారా 7 రోజులపాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. 100 స్పోర్ట్ మోడ్ మరియు వాచ్ ఫేస్‌ను కలిగి ఉంటుంది. IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా వస్తుంది. ఈ కలర్‌ఫిట్ పల్స్ 4 స్మార్ట్‌వాచ్ నాయిస్‌ఫిట్ యాప్ ద్వారా అన్ని వివరాలను యాక్సెస్ చేయవచ్చు. జెట్ బ్లాక్, స్పేస్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, రోజ్ గోల్డ్ పింక్, స్టార్‌లైట్ గోల్డ్, సిల్వర్ లింక్ మరియు బ్లాక్ లింగ్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. డిజైన్ పరంగాను ఆకట్టుకునేలా ఉంది.
ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 4 స్మార్ట్‌వాచ్ !
الخميس، 25 أبريل 2024
noise science smart watches technologyTru Sync తో బ్లూటూత్ 5.3 వెర్షన్‌తో కాలింగ్ ఫీచర్ ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 4 స్మార్ట్‌వాచ్
ليست هناك تعليقات:
إرسال تعليق