థింగ్ బ్రాండ్ బడ్జెట్ ధరలో నథింగ్ ఫోన్ (2a) 5G ని విడుదల చేసింది. ఈ ఫోన్ ను 25k సెగ్మెంట్ లో విడుదల చేసినా మొదటి రోజు లాంఛ్ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ 20 వేల ధరకే అందుకునే అవకాశం అందించింది. నథింగ్ ఫోన్ (2a) 5G స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 23,999 ప్రైస్ తో విడుదల చేసింది. రెండవ (8GB + 256GB) వేరియంట్ ను  రూ. 25,999 ప్రైస్ తో, హైఎండ్ వేరియంట్ (12GB + 256GB) ను రూ. 27,999 ప్రైస్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ మరియు EMI ల పైన రూ. 2,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ఆప్షన్ తో కొనే వారికి కూడా రూ. 2,000 అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ ను కేవలం రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. నథింగ్ సరికొత్తగా విడుదల చేసిన ఈ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7200 Pro కొత్త ప్రోసెసర్ తో వచింది. ఈ ఫోన్ లో 8GB / 12GB ర్యామ్ మరియు 128GB / 256GB స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ ను 6.7 ఇంచ్ Flexible AMOLED డిస్ప్లేతో తీసుకు వచ్చింది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి వుంది.  4K (at 60 fps) వద్ద వీడియో షూట్ చెయ్యగల 50MP (OIS) + 50MP డ్యూయల్ రియర్ సెటప్ కెమేరాని కలిగి వుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 32MP Camera (Sony IMX615) సెల్ఫీ కెమేరాని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని 45 ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ