దేశీయ మార్కెట్లో డెల్ అలైన్‌వేర్ ఎమ్18ఆర్2 పేరుతో కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఈ ప్రీమియం ల్యాప్‌టాప్ ధర రూ. 2,96,490గా నిర్ణయించారు. దీనిని 14th జెన్ Intel Core i7 ప్రాసెసర్‌తో తీసుకొచ్చారు. ఈ ల్యాప్‌టాప్‌ను మూడు రకాల CPU ఆప్షన్స్‌లో లాంచ్ చేవశారు. ఈ ల్యాప్‌టాప్‌ను డెల్ స్టోర్స్‌తో పాటు ప్రముఖ ఈ కామర్స్ సైట్స్ అమెజాన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో 18 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 1,920 x 1,200 పిక్సెల్‌తో కూడి రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ప్రీ ఇన్‌స్టాల్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు. ఇందులో 64 జీబీ వరకు డ్యూయల్ చానల్ DDR5 RAMతో పాటు, 4TB/8TB వరకు డ్యూయల్ స్టోరేజ్‌ను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే 97డబ్ల్యూహెచ్ కెపాసిటీతో అందించారు. ఇది 360W వరకు చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తోంది. ఇక ఇందులో ప్రత్యేకంగా అలైన్‌వేర్ క్రియో టెక్ అనే కూలింగ్ టెక్నాలజీని అందించారు. అఆలగే అలైన్‌ఎఫ్‌ఎక్స్ లైటింగ్, డాల్బీ విజన్, డాల్బీ ఆటమ్స్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది.
డెల్ అలైన్‌వేర్ ఎమ్18ఆర్2 ప్రీమియం ల్యాప్‌టాప్ విడుదల !
Sunday, March 17, 2024
14th జెన్ Intel Core i7 ప్రాసెసర్ 490 96 dell laptops science technology డెల్ అలైన్‌వేర్ ఎమ్18ఆర్2 ప్రీమియం ల్యాప్‌టాప్ విడుదల ధర రూ. 2
No comments:
Post a Comment