ఇన్ఫోసిస్ పూర్తిగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాకుండా హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరిస్తోంది. అంటే నెలకు 11 రోజులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొనే వెసులుబాటును కలిగించింది. ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఎక్స్‌పీరియన్స్ ప్లాట్‌ఫామ్ ఇన్ఫీమీ కొన్ని ఎంపిక చేసిన ఆఫీసుల్లో నెలలో 11 రోజుల పాటు ఇంటి నుండి పని కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది. నెలకు పేర్కొన్న కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులను పొందవచ్చు, మిగిలిన రోజులలో ఆఫీస్ నుండి పని చేయవచ్చు. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అభ్యర్థనలు మీ మేనేజర్ ఆమోదానికి లోబడి ఉంటాయి అంటూ కంపెనీ ఒక సందేశం పంపించింది. ఇదిలా ఉండగా గతంలో కొన్ని కంపెనీలు వారానికి ఐదు రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అమలు చేస్తున్న ఇతర కంపెనీలకు భిన్నంగా ఇన్ఫోసిస్ గత సంవత్సరం నవంబర్ 20 నుండి జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగులను నెలకు 10 రోజులు మాత్రమే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అమలు చేస్తోంది.. ఇప్పుడు ఇన్ఫోసిస్ నిర్ణయం పై మహిళలకు భారీ ఊరట కలుగుతుందని తెలుస్తుంది.. ఇంకా కొన్ని కంపెనీలు ఇదే ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.
ఇన్ఫోసిస్ లో హైబ్రిడ్ వర్క్ మోడల్ ?
الخميس، 29 فبراير 2024
science technology ఇన్ఫోసిస్ లో హైబ్రిడ్ వర్క్ మోడల్ ? ఎక్స్‌పీరియన్స్ ప్లాట్‌ఫామ్ ఇన్ఫీమీ కొన్ని ఎంపిక చేసిన ఆఫీసుల్లో నెలలో 11 రోజుల పాటు ఇంటి నుండి పని
ليست هناك تعليقات:
إرسال تعليق