వివో వీ30 ఫోన్ ను సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తుంది. 3డీ కర్వ్‌డ్ అమోలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ ఉంటాయి. వివో ఎస్18 ఫోన్ ను రీబ్రాండ్ చేసి విడుదల చేసినట్లు కనిపిస్తున్నది. త్వరలో భారత్ తోపాటు ఇతర గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేస్తామని తెలిపింది. వివో వీ 30 ఫోన్ ఆండ్రాయిడ్ 14 విత్ ఫన్ టచ్ ఓఎస్ 14 విత్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ (1260×2800 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుకలిగి ఉంటుంది. ట్రిపుల్ ఔరా రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ఓమ్నీ విజన్ ఓవీ50ఈ సెన్సర్ విత్ సపోర్ట్ ఫర్ ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), 50-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ పోర్ట్రైట్ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంది. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. బ్లూమ్ వైట్, లష్ గ్రీన్, నోబుల్ బ్లాక్, వేవింగ్ ఆక్వా కలర్స్‌లో లభిస్తుంది. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ కలిగి ఉంటుంది.
వివో వీ30 గ్లోబల్ మార్కెట్లలో విడుదల
الاثنين، 5 فبراير 2024
Qualcomm Snapdragon 7 Gen 3 SoC chip set. 3D curved AMOLED screen with 120 Hz refresh rate science smart phones technology Vivo V30 launched in global markets
ليست هناك تعليقات:
إرسال تعليق