జనరేటివ్ ఏఐపై కంపెనీలు ఫోకస్ ?

الأحد، 28 يناير 2024

and Singapore Australia china Companies focus on generative AI? including India Infosys Knowledge Institute japan New Zealand science technology

t f B! P L


జనరేటివ్ ఏఐపై కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలో ఆసియా పసిఫిక్ కంపెనీలు ఉత్పాదక ఏఐలో పెట్టుబడులను పెంచుతున్నాయి. భారత్ సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, సింగపూర్‌లలో కంపెనీలు 2024లో జనరేటివ్ ఏఐపై పెట్టే ఖర్చు దాదాపు మూడు రెట్లు పెరగనుందని, ఈ ఏడాదిలో ఆయా కంపెనీలు 3.4 బిలియన్ డాలర్లు (రూ.28 వేల కోట్లకు పైగా) ఖర్చు చేయనున్నాయని దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చేపట్టిన ఓ అధ్యయనం అంచనా వేస్తోంది. జనరేటివ్ ఏఐపై ఖర్చు విషయంలో ఉత్తర అమెరికా దేశాల కంటే తక్కుగా ఉన్నప్పటికీ ఆసియా పసిఫిక్ దేశాల్లో ఈ సాంకేతికతపై పరిశోధనలు, అభివృద్ధి అత్యధికంగా ఉన్నట్లు ఇన్ఫోసిస్ పరిశోధన విభాగమైన ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, భారతదేశం, సింగపూర్ దేశాల్లోని వెయ్యి మందికిపైగా బిజినెస్ లీడర్లు, ఏఐ పరిశోధకులతో ఇన్ఫోసిస్ ఈ సర్వే చేపట్టింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జనరేటివ్ ఏఐపై భారీగా పెట్టుబడి పెడుతున్న దేశాల్లో చైనా అగ్రగామిగా ఉంది. ఈ ఏడాది చైనా కంపెనీలు ఈ టెక్నాలజీపై పెట్టే ఖర్చు 160 శాతానికిపైగా పెరిగి 2.1 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. అయితే దీని ప్రభావం జాబ్స్‌పై కచ్చితంగా ఉంటుందన్న ఆందోళన ఉద్యోగులను కలవపెడుతోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ