దేశీయ మార్కెట్లో నథింగ్ ఫోన్ (2)  ధర శాశ్వతంగా తగ్గించబడింది. ఈ ధర తగ్గింపు తో ఈ ఫోన్‌ను మునుపటి కంటే చాలా సరసమైన ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది  జూలైలో లాంచ్ చేయబడింది. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC చిప్ సెట్, 50MP డ్యూయల్ కెమెరా సెన్సార్లు మరియు 120Hz అమోలెడ్ డిస్‌ప్లే వంటి ప్రీమియం స్పెసిఫికేషన్‌లతో లాంచ్ చేయబడింది. ఈ ధర తగ్గింపు ఇప్పటికే వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ (2) స్మార్ట్ ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ. 44,999 గా లాంచ్ చేయబడింది. అలాగే, 12GB + 256GB మోడల్‌ ధర రూ. 49,999 మరియు 12GB + 512GB మోడల్‌ ధర రూ. 54,999 గా లాంచ్ అయ్యాయి. ప్రస్తుతం రూ.5000 ధర తగ్గింపు తర్వాత 8GB/128GB మోడల్‌ రూ. 39,999 కు, 12GB/256GB మోడల్ రూ. 44,999 మరియు 12GB/512GB మోడల్ రూ. 49,999 కి అందుబాటులో ఉంటుంది. ఈ ధర తగ్గింపు కు అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ ధర మరింత తగ్గుతుంది. ఇంకా, ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ మరియు క్రోమా స్టోర్‌లలో లభిస్తుంది.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ