Ad Code

పదేళ్లు పని చేసిన ఉద్యోగులకు యాపిల్‌ సీఈవో స్పెషల్‌ గిఫ్ట్‌ !


యాపిల్‌ కంపెనీ పదేళ్ల సర్వీస్‌ని చేరుకున్న ఉద్యోగులను ప్రత్యేకమైన, అత్యంత విలువైన అవార్డుతో సత్కరిస్తుంది. ఈ అవార్డు కొనుగోలుకు అందుబాటులో లేదు, కంపెనీలో ఒక దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలం పని చేసిన ఉద్యోగులకు ప్రత్యేకంగా ఇస్తుంది. ఈ అవార్డ్ సాలిడ్ మెటల్ మెమెంటో, దాని మధ్యలో ఒక నిగనిగలాడే యాపిల్‌ లోగోతో చాంఫెర్డ్ అంచులు ఉంటాయి. ఉద్యోగి పేరు, పదేళ్ల సర్వీసు పూర్తి చేసిన తేదీని కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ అవార్డును అందించిన విధానం మరింత ప్రత్యేకం. అన్‌బాక్సింగ్ ఎక్స్‌పీరియన్స్‌ యాపిల్‌ ప్రొడక్టును ఓపెన్‌ చేస్తున్నంత లగ్జీరియస్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. యాపిల్‌ వాచ్ అల్ట్రా ప్యాకేజింగ్‌ను గుర్తుకు తెచ్చే విధంగా ఉంటుంది. బాక్స్‌ ఓపెన్‌ చేసిన తర్వాత, యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ నుంచి వచ్చిన మెసేజ్‌ ఉంటుంది. ఈ అవార్డును ఇటీవల అందుకున్న సందర్భంగా, యాపిల్‌లో హ్యూమన్ ఇంటర్‌ఫేస్ డిజైనర్ మార్కోస్ అలోన్సో తన సక్సెస్‌ని ప్రపంచంతో షేర్‌ చేసుకున్నారు. అన్‌బాక్సింగ్ వీడియో, ఇమేజ్‌లను పోస్ట్‌ చేశారు. టిమ్ కుక్ నుంచి అందిన హార్ట్‌ఫెల్ట్‌ మెసేజ్‌ కూడా ఉంది. 'ఈ మైలురాయిని చేరుకున్నందుకు అభినందనలు. మీరు చేసిన పని, మీరు ఎదుర్కొన్న సవాళ్లు, మీరు సాధించిన పురోగతులు-ఇవన్నీ ప్రపంచాన్ని మంచిగా మార్చే యాపిల్‌ మిషన్‌కు లోతైన, శాశ్వతమైన సహకారాన్ని అందిస్తాయి. మన ప్రయాణంలో మీరు అందించిన సేవలకు యాపిల్‌లోని ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు.' అని మెసేజ్‌ రాసి ఉంది, కింద టిమ్ కుక్ సంతకం ఉంది.


Post a Comment

0 Comments

Close Menu