ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో 'యాడ్ – ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్' అందుబాటులోకి వచ్చింది. నిర్ణీత రుసుమును చెల్లించి ఈ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే యాడ్స్ లేకుండా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను చూడొచ్చు. అయితే ఈ షరతు మన ఇండియా నెటిజన్స్ కోసం కాదు. యూరప్ దేశాల నెటిజన్స్ కోసం మాత్రమే! యూరప్ దేశాల నెటిజన్స్ ఇకపైనా Facebook, Instagramలను ఫ్రీగా వాడుకోవచ్చు. అయితే వాటిలోని ఫీడ్‌లో న్యూస్, ఫ్రెండ్స్ పోస్టులతో పాటు యాడ్స్ కూడా వస్తాయి. 'యాడ్ – ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్'ను తీసుకుంటే యాడ్స్ గోల ఉండదు. టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. 18 ఏళ్లకు పైబడిన వారికే ఈ సబ్ స్క్రిప్షన్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ల మాతృసంస్థ 'మెటా' ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఈవివరాలను వెల్లడించింది.నవంబరు 1 నుంచి యూరోపియన్ యూనియన్, యూరోపియన్ ఎకనామిక్ ఏరియా, స్విట్జర్లాండ్‌లలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు 'యాడ్ – ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్'ను కొనుగోలు చేయొచ్చని తెలిపింది. వెబ్ ప్లాట్‌ఫామ్‌లో సబ్ స్క్రిప్షన్ ప్లాన్ కోసం నెలకు రూ. 880, iOS, Android ప్లాట్‌ఫామ్‌లలో నెలకు రూ. 1,100 చొప్పున చెల్లించాల్సి(Paid – Facebook – Instagram) ఉంటుంది.
0 Comments