Ad Code

భద్రత కోసం కీలక ఫీచర్లు ?


వాట్సాప్ మరో కీలక ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ వాట్సాప్‌ వినియోగదారులు భద్రతను మరింత మెరుగుపరుస్తుందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్‌ తెలిపింది. వాట్సాప్‌ ప్రత్యామ్నాయ ప్రొఫైల్‌ను  క్రియేట్‌ చేసుకొనే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఈ ఫీచర్‌ ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. యూజర్ల తన ప్రొఫైల్‌ వివరాలను ఎంచుకున్న వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయవచ్చు. ప్రత్యామ్నయ ప్రొఫైల్‌లో పేరు, ఫోటోను కూడా మార్చుకోవచ్చు. ఫలితంగా మీ వివరాలు మరింత గోప్యంగా ఉంచేందుకు అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు వాట్సాప్‌ వెబ్‌ యూజర్లకు మరో మెరుగైన ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ వాట్సాప్ స్క్రీన్‌ లాక్‌  ఫీచర్‌తో వెబ్‌ను లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ యూజర్లకు మరింత భద్రతను కల్పిస్తుంది. ఆఫీస్‌ సహా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న సమయంలో కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లో వాట్సాప్‌ వెబ్‌లోకి లాగిన్‌ అవుతాం. అయితే విరామ సమయంలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లాగవుట్‌ చేసి వెళ్తుంటాం. మళ్లీ కంప్యూటర్‌ వద్దకు వచ్చాక మరోసారి లాగిన్‌ అవుతాం. ఇదంతా కొన్నిసార్లు ఇబ్బంది అనిపించవచ్చు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వాట్సాప్‌ లాక్‌ స్క్రీన్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో విరామ సమయంలో వాట్సాప్ వెబ్‌ స్క్రీన్‌ను లాక్‌ చేసుకోవచ్చు. మళ్లీ పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ కావచ్చు. ఆటోమేటిక్‌ స్క్రీన్‌ లాక్‌ టైమింగ్‌ను ఎంచుకొనే ఆప్షన్‌ ఈ ఫీచర్‌లో ఉంది. లాక్‌ చేసిన చాట్‌ను మరింత గోప్యంగా ఉంచుకొనే విధంగా వాట్సాప్‌ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం సీక్రెట్‌ కోడ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం. ఈ Locked Chat ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు సీక్రెట్‌ కోడ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WABetainfo ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాట్సాప్‌లో చాట్‌ లాక్‌  ఫీచర్‌ ద్వారా లాక్‌ చేసిన చాట్‌ను అందరూ యాక్సెస్‌ చేయలేరు. కానీ ఆ జాబితాలోని వివరాలు తెలియకపోయినా.. అక్కడ కొన్ని చాట్‌లను లాక్‌ చేసినట్లు మాత్రం ఇతరులకు తెలిసే అవకాశం ఉంటుంది. అయితే త్వరలో రానున్న ఈ ఫీచర్‌తో లాక్‌ చేసిన చాట్‌ అసలు చాట్‌ లిస్ట్‌లో కనిపించదని తెలుస్తోంది. వినియోగదారుడు పూర్తిగా ఈచాట్‌ను ఎవరికీ కనిపించకుండా చేసేందుకు అవకాశం ఉంటుంది. సెర్చ్‌ బార్‌లో సీక్రెట్‌ కోడ్ ఎంటర్‌ చేస్తేనే చాట్‌ లాక్‌లో ఉన్న కాంట్రాక్ట్‌లు కనిపిస్తాయి. ఫలితంగా వాట్సాప్‌ యూజర్‌కు వ్యక్తిగత సమాచారానికి మరింత మెరుగైన భద్రత లభిస్తుందని వాట్సాప్ భావిస్తున్నట్లు సమాచారం. అంటే చాట్‌ లాక్‌ను యాక్సెస్‌ చేసేందుకు మరో సీక్రెట్‌ కోడ్‌ అవసరం కానుంది. త్వరలో ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.  పాస్‌కీస్‌ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఫలితంగా ఓటీపీ, SMS వంటి అవసరం లేకుండా ఫింగర్‌ ఫ్రింట్‌, ఫేస్‌, పిన్ సాయంతో వాట్సాప్‌ను సులభంగా యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఫలితంగా నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల్లో వాట్సాప్‌ తెరిచేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మరియు పాస్‌కీస్‌ ద్వారా మరింత మెరుగైన భద్రత లభిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu