వండర్‌లస్ట్ ఈవెంట్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 9ను ఇటీవల లాంచ్ చేసింది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈ స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్ ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. దేశంలో రూ. 41,900 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. జీపీఎస్, సెల్యులార్ మోడల్స్‌లో వాచ్‌ను లాంచ్ చేశారు. మిడ్ నైట్, స్టార్ లైట్, పింక్, సిల్వర్, ప్రొడక్ట్ రెడ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో ఆల్వేస్ ఆన్ రెటీనా డిస్‌ప్లేను అందించారు. దీని పీక్ బ్రైట్‌నెస్ 2000 నిట్స్‌గా ఉంటుంది. ఇక ఈ వాచ్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 18 గంటల పాటు పనిచేస్తుంది. యూజర్ల ప్రైవసీకి పెద్దపీట వేస్తూ ఇందులో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఇచ్చారు. మరో ప్రత్యేక ఫీచర్ డబుల్ ట్యాప్ జెస్చర్ దీని ద్వారా యూజర్లు కాల్స్ ఆన్సర్ చేసుకోవచ్చు. మ్యూజిక్ కంట్రోల్‌తో పాటు కెమెరాను ఆపరేట్ చేసుకోవచ్చు. హైకింగ్, సైక్లింగ్ వంటి హెల్త్ ఫీచర్స్ ఈ వాచ్ సొంతం. ఇక యాపిల్ వాచ్ సిరీస్9 వాచ్‌లో మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేసే హెల్త్ సపోర్ట్ టూల్స్‌ను అందించారు.
యాపిల్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్ సిరీస్ 9 !
الأحد، 15 أكتوبر 2023
apple science smart watches technology ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది యాపిల్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్ సిరీస్ 9
ليست هناك تعليقات:
إرسال تعليق