కస్టమర్ సపోర్ట్ టీమ్ ఉద్యోగులలో 90 శాతం మందిని తొలగించినట్లు ఈ-కామర్స్ స్టార్టప్ దుకాణ్ సీఈఓ సుమిత్ షా వెల్లడించారు. ఆ ఉద్యోగులు చేసే పని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్‌బాట్‌ను తీసుకువచ్చినట్లు చెప్పారు. లాభాలను దృష్టిలో పెట్టుకునే ఈ పని చేసినట్లు ఆయన సమర్ధించుకున్నారు. దీంతో కస్టమర్ సపోర్ట్ ఖర్చులు 85 శాతం తగ్గాయని, రిజొల్యూషన్ టైము కూడా అంతకు ముందున్న రెండు గంటల నుంచి ఇప్పుడు 3 నిమిషాలకు తగ్గిపోయిందని షా పేర్కొన్నారు. తాజాగా తెచ్చిన ఏఐ చాట్‌బాట్ వల్లే 90 శాతం మంది ఉద్యోగులను తీసేయాల్సి వచ్చిందని షా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పెద్ద దుమారమే రేపుతోంది. చాలా మంది ట్విటర్ యూజర్లు షా నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా యూనికార్న్ కావడం మీద కంటే లాభదాయకత పెంచుకోవడంపైనే స్టార్టప్‌లు ఫోకస్ పెట్టాల్సి వస్తోందని చెబుతూ, ఉద్యోగుల కోత ఆ దిశలో తీసుకున్న నిర్ణయంగానే సుమిత్ షా వివరించారు. https://t.me/offerbazaramzon
కస్టమర్ సపోర్ట్ టీమ్ ఉద్యోగులలో 90 శాతం మంది తొలగింపు
الأربعاء، 12 يوليو 2023
science technology కస్టమర్ సపోర్ట్ ఖర్చులు 85 శాతం తగ్గాయని కస్టమర్ సపోర్ట్ టీమ్ ఉద్యోగులలో 90 శాతం మంది తొలగింపు రిజొల్యూషన్ టైము కూడా అంతకు ముందున్న రెండు గంటల నుంచి ఇప్పుడు 3 నిమిషాలకు
ليست هناك تعليقات:
إرسال تعليق