దేశీయ మార్కెట్‌లో రెనో కంపెనీ ట్రైబర్ పేరుతో సెవెన్ సీటర్ కారును అందుబాటులో తెచ్చింది. ఈ కారులో ఒకేసారి ఏడుగురు కూర్చొని ప్రయాణించ వచ్చు. అంతేకాకుండా ధర తక్కువ, మైలేజ్ కూడా ఎక్కువ. రెనో ట్రైబర్ కారు ధర రూ. 5.99 లక్షల నుంచి ప్రారభం అవుతోంది. ఇది ఎక్స్‌షోరూమ్ రేటు. 2022 మోడల్‌కు ఇది వర్తిస్తుంది. ఈ కారుపై గరిష్టంగా రూ. 62 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. అలాగే 2023 మోడల్ అయితే ధర రూ. 6.33 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఇది కూడా ఎక్స్‌షోరూమ్ రేటు. ఈ కారుపై అయితే రూ. 45 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ తగ్గింపు ఆఫర్లు ఈ నెల వరకే అందుబాటులో ఉంటాయి. ఈ కారు లీటరుకు దాదాపు 18 నుంచి 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇందులో హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఫ్రంట్ అండ్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ ఇందులో 1 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చింది. జూన్ నెలలో ఇతర మోడళ్లపై కూడా తగ్గింపు అందుబాటులో ఉంది. కాగా ఆఫర్లు అనేవి ప్రాంతం, డీలర్‌షిప్ ఆధారంగా మారుతూ ఉంటాయి. అందుకే కొనే ముందు షోరూమ్‌కు వెళ్లి కారు ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం. https://t.me/offerbazaramzon
ホーム
/
మైలేజ్ ఎక్కువ
/
దేశీయ మార్కెట్‌లో రెనో కంపెనీ ట్రైబర్ కారు !
الاثنين، 12 يونيو 2023
automobile technology తగ్గింపు ఆఫర్లు ఈ నెల వరకే అందుబాటులో ఉంటాయి దేశీయ మార్కెట్‌లో రెనో కంపెనీ ట్రైబర్ కారు ధర తక్కువ మైలేజ్ ఎక్కువ
ليست هناك تعليقات:
إرسال تعليق