యాపిల్ ప్రీమియం ధర పరిధిలో మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌వాచ్ కొత్త యాపిల్ వాచ్ అల్ట్రా దేశీయ మార్కెట్లో దీని ధర రూ. 89,900. ఇంత ఖరీదు పెట్టి స్మార్ట్ వాచ్ కొనాలంటే సామాన్యులవల్లకాదు కానీ, యాపిల్ వాచ్ అల్ట్రా మాదిరిగానే కనిపించే మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ని సొంతం చేసుకోవచ్చు. అదే pTron Force X12N స్మార్ట్ వాచ్. దీన్ని రూ. 1,499 ధరతో ప్రారంభమైంది. ప్రస్తుతం రూ. 1,199కే అందుబాటులో ఉంది. ఆపిల్ వాచ్ అల్ట్రాతో పొలిస్తే మీరు ఈ PTron వాచ్‌ని 20-30 రెట్లు తక్కువ ధరకు పొందుతారు. ఈ స్మార్ట్‌వాచ్ pTron Force X12N దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఉంటుంది.1.85-అంగుళాల TFT LCD డిస్‌ప్లేను రౌండబుల్ క్రౌన్ కలిగి ఉంది. సిలికాన్ బెల్ట్‌తో ప్రీమియం అల్లాయ్ మెటల్ కేసింగ్‌ను కలిగి ఉంది. ఈ వాచ్ 100 కన్నా ఎక్కువ క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లతో వస్తుంది. IP68 రేటింగ్‌తో వాటర్‌ప్రూఫ్‌గా పనిచేస్తుంది. స్మార్ట్‌వాచ్‌లో 10 మీటర్ల వైర్‌లెస్ రేంజ్‌తో బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉంది. ForceX12N బిల్ట్-ఇన్ మైక్రోఫోన్, కాంటాక్ట్ సింక్‌తో స్పీకర్, హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. డయల్ ప్యాడ్‌తో కూడా వస్తుంది. వాచ్ Android 8.0 అంతకన్నా ఆపై OS వెర్షన్, iOS 9.1, అంతకంటే ఎక్కువ OS వెర్షన్ సపోర్టు ఉన్న డివైజ్‌లకు అనుకూలంగా ఉంటుంది. 3 గంటల మాగ్నెటిక్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ని అందిస్తామని pTron హామీ ఇచ్చింది. స్మార్ట్‌వాచ్‌లో 5 బిల్ట్-ఇన్ గేమ్‌లు, స్మార్ట్ హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకర్లు, హార్ట్ రేట్ చెక్, SpO2 బ్లడ్ ఆక్సిజన్, బ్లడ్ ప్రెజర్ చెక్, స్లీప్ మానిటర్, సెడెంటరీ అలర్ట్, స్టెప్ కౌంట్, బర్న్డ్ క్యాలరీలు & 8 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. అదనంగా, మెసేజ్ పుష్, రిస్ట్ సెన్స్, డోంట్ డిస్టర్బ్ మోడ్ వంటి మరిన్ని ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ ఒక ఏడాది వారంటీతో వస్తుంది. బ్లేజింగ్ బ్లూ, గోల్డ్ బ్లాక్, కార్బన్ బ్లాక్ , మరియు షాంపైన్ పింక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు ఈ-కామర్స్ సైట్ అమెజాన్ నుంచి ఈ కొత్త స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు.
యాపిల్ వాచ్ లుక్ తో pTron Force X12N స్మార్ట్ వాచ్ !
الجمعة، 24 فبراير 2023
IP68 రేటింగ్‌తో వాటర్‌ప్రూఫ్ science smart watch technologe TFT LCD డిస్ప్లే దీర్ఘచతురస్రాకార ఆకారం యాపిల్ వాచ్ లుక్ తో pTron Force X12N స్మార్ట్ వాచ్ !
ليست هناك تعليقات:
إرسال تعليق