ఓలా స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మార్చడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే ముక్కున వేలుసుకుంటారు. ఈ ధరలో మీరు కొత్త ఓలా స్కూటర్ కొనుగోలు చేయొచ్చు. ఆ రేంజ్‌లో ధరలు ఉన్నాయి. ఓలా ఎస్ ప్రో బ్యాటరీ మార్చడానికి ఏకంగా రూ. 87,298 చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఓలా స్కూటర్లల్లో ఉండే బ్యాటరీలు 2 కేడబ్ల్యూ, 3 కేడబ్ల్యూ, 4 కేడబ్ల్యూ కెపాసిటీతో ఉంటాయి. ఓలా ఎస్ 1, ఓలా ఎస్ ఎయిర్ బ్యాటరీల ధర రూ. 66,549గా ఉంది. 3 కేడబ్ల్యూ బ్యాటరీకి ఈ రేటు వర్తిస్తుంది. అదే 4 కేడబ్ల్యూ బ్యాటరీకి అయితే రేటు రూ. 87 వేలకు పైగా ఉంది. అందువల్ల ఈ రేంజ్‌లో డబ్బులు పెట్టి కొత్త బ్యాటరీ వేసుకోవాలంటే అది కష్టమనే చెప్పుకోవాలి. అందువల్ల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే బ్యాటరీల ధర ఎంత ఉందనే విషయాన్ని చెక్ చేసుకోండి. కేవలం ఓలా మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ , ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నా కూడా ఈ విషయాన్ని గుర్తించుకోవాల. ముందుగా బ్యాటరీ ధర ఎంత ఉందో తెలుసుకోవాలి. ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే బ్యాటరీ ధర రూ.లక్షల్లో ఉండే అవకాశం ఉంది.
ఓలా ఎస్ ప్రో బ్యాటరీ మార్చడం తలకుమించిన భారం ?
الأربعاء، 22 فبراير 2023
2 కేడబ్ల్యూ 3 కేడబ్ల్యూ 4 కేడబ్ల్యూ కెపాసిటీ electric scooter ola science technologe ఓలా ఎస్ ప్రో బ్యాటరీ మార్చడం తలకుమించిన భారం ?
ليست هناك تعليقات:
إرسال تعليق