ప్రపంచవ్యాప్తంగా ఎరిక్సన్ 1400 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగ, కార్మిక సంఘాలతో సంప్రదింపుల అనంతరం లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నామని టెలికాం నెట్‌వర్కింగ్ కంపెనీ ఎరిక్సన్ తెలిపింది. ఉద్యోగులను తొలగించడం సులభం కాదని, ఇది సంక్లిష్ట నిర్ణయమని ఉద్యోగుల పట్ల గౌరవం, ప్రొఫెషనలిజంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. సంబంధిత సిబ్బందికి తొలుత పూర్తి వివరాలు తెలియచేస్తామని ఎరిక్సన్ తెలిపింది. కన్సల్టంట్ల తగ్గింపు, వివిధ ప్రాసెస్‌ల క్రమబద్ధీకరణ, సౌకర్యాల్లో కోత వంటి పలు వ్యయ నియంత్రణ చర్యలు ఉంటాయని పేర్కొంది. గతంలో వెల్లడించిన విధంగా ఉద్యోగుల తగ్గింపూ తప్పదని ఎరిక్సన్ స్పష్టం చేసింది. స్వీడన్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రభావం ఇతర దేశాలపైనా ఉంటుందని భావిస్తున్నారు. స్వీడన్ కేంద్రంగా ఎరిక్సన్‌లో 14,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఎరిక్సన్ లో 1400 మంది ఉద్యోగుల తొలగింపు
الثلاثاء، 21 فبراير 2023
science technologe ఉద్యోగులను తొలగించడం సులభం కాదని ఎరిక్సన్ లో 1400 మంది ఉద్యోగుల తొలగింపు టెలికాం నెట్‌వర్కింగ్ కంపెనీ
ليست هناك تعليقات:
إرسال تعليق