గూగుల్ క్రోమ్ యూజర్లకు హెచ్చరిక

الثلاثاء، 3 مايو 2022

google science technologe గూగుల్ క్రోమ్ యూజర్లకు హెచ్చరిక

t f B! P L


ఇంటర్నెట్ బ్రౌజర్‌లలో గూగుల్ క్రోమ్ చాలా ప్రాముఖ్యత వుంది.  ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్, విండోస్‌తో సహా ఇతర ఓఎస్ యూజర్లు కూడా వాడుతున్నారు. అయితే ఇప్పుడు గూగుల్ క్రోమ్ యూజర్లకు భారీ స్థాయి ముప్పు పొంచి ఉందని తాజాగా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరించింది. ఈ సైబర్ క్రైమ్ నోడల్ ఏజెన్సీ డెస్క్‌టాప్ క్రోమ్ బ్రౌజర్‌ లో కొన్ని ప్రధాన సాంకేతిక బలహీనతలను హైలైట్ చేసింది. ఈ టెక్నికల్ వీక్నెసెస్‌ని హ్యాకర్లు ఈజీగా యూజ్ చేసుకొని యూజర్లపై సైబర్ అట్టాక్ చేసే ప్రమాదం లేకపోలేదు. అందుకే సీఈఆర్టీ-ఇన్ క్రోమ్ బ్రౌజర్‌ను వెంటనే లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయాలని యూజర్లకు కోరుతోంది. ఈ టెక్నికల్ వీక్నెసెస్‌ని గూగుల్ ఇప్పటికే గుర్తించి వాటిని లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఫిక్స్ చేసింది. 101.0.4951.41కి ముందు ఉన్న గూగుల్ క్రోమ్ వెర్షన్ సాఫ్ట్‌వేర్‌లోని కొత్త సాంకేతిక లోపం ఉంది. దీనివల్ల డెస్క్‌టాప్ యూజర్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ లోపాన్ని గూగుల్ గుర్తించిన తర్వాత క్రోమ్ బ్లాగ్ పోస్ట్‌లో 30 లోపాలను లిస్ట్ చేసింది. ఇందులో దాదాపు ఏడు లోపాలు కారణంగా యూజర్లకు అధిక ముప్పు ఉందని గూగుల్ వెల్లడించింది. ఈ లోపాల వల్ల రిమోట్ అటాకర్లు యూజర్ల సిస్టమ్‌లో కోడ్‌ని అమలు చేసి.. సున్నితమైన సమాచారానికి యాక్సెస్ చేయడం సాధ్యమవుతుందని CERT-In వివరించింది. ఈ లోపం సెక్యూరిటీ పరిమితులు దాటవేయడానికి హ్యాకర్లకు మార్గం సుగమం చేస్తుంది. అలాగే యూజర్ల సిస్టమ్‌పై బఫర్ ఓవర్‌ఫ్లోకి కారణమయ్యేలా అనుమతిస్తుంది. సైబర్ క్రైమ్ నోడల్ ఏజెన్సీ ప్రకారం, "Vulkan, SwiftShader, ANGLE, డివైజ్ ఏపీఐ, Sharin సిస్టమ్ ఏపీఐ, ఓజోన్, బ్రౌజర్ స్విచర్, బుక్ మార్క్స్, దేవ్ టూల్స్ ఇన్‌పుట్, HTML పార్సర్, వెబ్ GPU లో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో, యూఐ షెల్ఫ్‌కు మెమరీ యాక్సెస్, బ్లింక్ ఎడిటింగ్ వంటివి ఉపయోగిస్తే దాడులు చేసేవారికి లక్ష్యం అయ్యే ప్రమాదం ఎక్కువ. ఈ కారణంగా మీ బ్రౌజర్‌ని వెంటనే వెర్షన్ 101.0.4951.41కి అప్‌గ్రేడ్ చేయండి. విండోస్, మ్యాక్, అలాగే Linux యూజర్లు తమ పర్సనల్ డేటా లీక్ అవ్వకుండా ఉండాలంటే త్వరగా కొత్త వర్షన్ అప్‌డేట్ చేసుకోవడం మంచిది. గూగుల్ విండోస్ , మ్యాక్, లైనెక్స్ (Linux) కోసం అప్‌డేట్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. ఈ అప్‌డేట్ రాబోయే రోజులు లేదా వారాల్లో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది. iQoo Z6 4G: 27 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్... భారీ డిస్కౌంట్‌తో ఐకూ జెడ్6 4జీ సేల్క్రో మ్ బ్రౌజర్‌ని లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయండిలా అప్‌డేట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, బ్రౌజర్ ఆటోమేటిక్ గా అప్‌డేట్ అవుతుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ