నంబర్‌ సేవ్‌ చేయకుండానే వాట్సాప్‌ మెసేజ్‌ !

الجمعة، 21 يناير 2022

science technologe WhatsApp నంబర్‌ సేవ్‌ చేయకుండానే వాట్సాప్‌ మెసేజ్‌

t f B! P L


వాట్సాప్‌ వాడని వారుండరు. చిన్నారుల నుంచి పెద్దల వరకు స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ ఉండి తీరాల్సిందే. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు ఎంతో మంది వాట్సాప్‌లో మునిగి తేలుతున్నారు. వాట్సాప్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. స్మార్ట్‌ఫోన్ల రాకతో సంప్రదాయక మొబైల్‌ మెసేజ్‌లకు స్వస్తి చెప్పి పలు యాప్స్‌ను ఉపయోగించి మెసేజ్‌లను చేస్తుంటాం. వాట్సాప్‌లో ఒకరికి మెసేజ్‌ చేయాలంటే కచ్చితంగా ఆ వ్యక్తి నంబర్‌ ఫోన్‌లో సేవ్‌ అయి ఉండాలి. అప్పుడు మెసేజ్‌ పంపేందుకు వీలవుతుంది. ఇక థర్డ్‌పార్టీ యాప్స్‌ ఉపయోగించి వ్యక్తి నంబర్‌ సేవ్‌ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్‌ చేయవచ్చు. థర్డ్‌పార్టీ యాప్స్‌నుపయోగించి మెసేజ్‌ చేయడం మన భద్రతకే భంగం వాటిల్లుతుంది. అంతేకాకుండా మనల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. మీ ఫోన్‌లోని బ్రౌజర్‌ని (క్రోమ్‌ లేదా ఫైర్‌ఫాక్స్‌) ఒపెన్‌ చేయండి. ఇప్పుడు మీరు https://wa.me/xxxxxxxxxx ఈ లింక్‌ని కాపీ చేసి యూఆర్‌ఎల్‌ అడ్రస్‌ బార్‌లోపేస్ట్‌ చేయాలి. ఇక్కడ xxxxxxxxxx స్థానంలో మన దేశం కోడ్‌ 91తో పాటు మీరు మెసేజ్‌ పంపాలనుకున్న మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఉదాహరణ: మీ వాట్సాప్‌లో సేవ్‌ చేసుకోలేని ఓ వ్యక్తి నెంబర్‌కు https://wa.me/919911111111 ఎంటర్‌ చేయాలి. తొలి రెండు అంకెలు మన దేశ కోడ్‌. తరువాతది మెసేజ్‌ పంపాలనుకున్న వ్యక్తి మొబైల్ నంబర్‌. తరువాత మీరు  వ్యక్తి ఫోన్‌ నంబర్‌తో గ్రీన్‌ కలర్‌తో మెసేజ్‌ బటన్‌తో ఒక వాట్సాప్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. గ్రీన్‌ కలర్‌ మెసేజ్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే మీరు వాట్సాప్‌కు మళ్లించబడతారు. అంతే మీరు వ్యక్తి నెంబర్‌ను సేవ్‌ చేసుకోకుండా ఈ విధంగా మెసేజ్‌ చేయవచ్చును.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ