షియోమి 12 సిరీస్ లాంఛ్ కోసం కసరత్తు సాగిస్తున్న షియోమి నెక్ట్స్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ సిరిసీ షియోమి 12ను ఈనెల 28న ప్రవేశపెడుతుందని భావిస్తున్నారు. షియోమి 12 క్వాల్‌కాం లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్‌తో ఎఫ్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో 6.2 ఇంచ్ కర్వ్డ్ డిస్‌ప్లేతో కస్టమర్ల ముందుకు రానుందని పలు రిపోర్ట్స్ వెల్లడించాయి. షియోమి 12.. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాతో ఆకట్టుకోనుందని అంచనా. షియోమి 12తో పాటు ఈ సిరీస్‌కు చెందిన షియోమి 12X, 12 అల్ట్రా లాంఛ్ అవుతాయని భావిస్తున్నారు. షియోమి 12 లైనప్‌లో షియోమి 12, షియోమి 12X, షియోమి 12ప్రొ, షియోమి 12 అల్ట్రా మోడల్స్ ఉన్నాయి. ఇక ప్రముఖ టెక్ నిపుణుడు స్టీవ్ హెమెర్‌స్టాఫర్ విడుదల చేసిన లీక్ ఫోటోల్లో షియోమి 12 డివైజ్ చిన్నదిగా ఉంటుందని వెల్లడైంది. హ్యాండ్‌సెట్ 67డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. అయితే షియోమి 12 ప్రొ మాత్రం భారీ బ్యాటరీ, బిగ్గర్ స్క్రీన్, 120డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో కస్టమర్ల ముందుకొస్తుందని భావిస్తున్నారు.
28న షియోమి 12 సిరీస్ విడుదల ?
الأحد، 19 ديسمبر 2021
28న షియోమి 12 సిరీస్ విడుదల ? science Smartphone technologe Xiaomi
ليست هناك تعليقات:
إرسال تعليق