మరి కొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. న్యూ ఇయర్ కు కొత్త ఫోన్ కొనాలని చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. అయితే, అటువంటి వారికి దాదాపు నెల రోజుల ముందే న్యూఇయర్ ఆఫర్ తీసుకొచ్చింది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ . ఐఫోన్ 12 ప్రో కొనుగోలు చేయాలనుకునే వారి కోసం బిగ్ డీల్ ప్రకటించింది. ఈ డిల్ కింద ఐఫోన్ 12 ప్రో మోడల్స్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ మోడల్‌పై ఏకంగా రూ. 25 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 12 ప్రోకు చెందిన అన్ని వేరియంట్లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని అమెజాన్ స్పష్టం చేసింది. ఐఫోన్ 12 ప్రో 128 జీబీ పసిఫిక్ బ్లూ వేరియంట్ అసలు ధర రూ.1,19,900 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ. 94,900 వద్ద కొనుగోలు చేయవచ్చు. రూ. 25 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీనికి అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గరిష్టంగా రూ.15,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఒకవేళ, మీరు 256 జీబీ, 512 జీబీ వేరియంట్ల కోసం చూస్తున్నట్లయితే, వాటిపై కూడా భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ 12 ప్రో 256 జీబీ వేరియంట్‌ను రూ. 99,990 ధర వద్ద విక్రయిస్తోంది. అంటే దీనిపై మీకు రూ. 30,000 డిస్కౌంట్ లభిస్తుంది. మరోవైపు, 512 జీబీ వేరియంట్‌పై రూ. 42,000 ఆదా చేసుకోవచ్చు. ఇది మీకు కేవలం రూ. 1,07,900 వద్ద లభిస్తుంది. కేవలం ఐఫోన్ 12 ప్రో పైనే కాకుండా ఎయిర్‌పాడ్స్‌పై కూడా డిస్కౌంట్ (Discount) పొందవచ్చు. మీరు అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 12 ప్రో, ఎయిర్‌పాడ్స్ ప్రో కాంబోను రూ. 1,15,395 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ కాంబో అసలు ధర రూ.1,44,800 వద్ద ఉండగా.. దీనిపై దాదాపు రూ. 28,910 ఆదా చేసుకోవచ్చు. ఐఫోన్ 13పై మాత్రం ఎలాంటి డిస్కౌంట్ ఉండదని అమెజాన్ స్పష్టం చేసింది. ఆపిల్ ఐఫోన్ 13 మినీ బేస్ వేరియంట్ రూ.69,900 వద్ద లభిస్తుంది. ఇక 256 జీబీ వేరియంట్ రూ. 79,900, 512 జీబీ వేరియంట్ రూ. 99,900 వద్ద అందుబాటులో ఉంటుంది.
అమెజాన్‌లో ఐఫోన్ 12 ప్రోపై రూ. 25 వేల తగ్గింపు
السبت، 4 ديسمبر 2021
iphone12 science technologe అమెజాన్‌లో ఐఫోన్ 12 ప్రోపై రూ. 25 వేల తగ్గింపు న్యూ ఇయర్
ليست هناك تعليقات:
إرسال تعليق