తినే ఆహారం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయా?

الاثنين، 8 نوفمبر 2021

health kidny non vigiterian తినే ఆహారం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయా?

t f B! P L


మనం నిత్యం తీసుకొనే కొన్ని రకాల ఆహారాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేవిగా ఉండవచ్చు. అలాంటి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇటీవలి కాలంలో అందరి జీవన విధనాల్లో మార్పులు వచ్చాయి. తినే ఆహారంలో ఫ్రై ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, వేపుళ్లు, నూనె పదార్థాలు, ఐస్‌క్రీమ్‌ల, కేకులు, కూల్ డ్రింకుల వంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలాంటి ఆహారాల వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం. ఇటీవలి కాలంలో ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలు అయిన కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు కనీసం మూత్ర విసర్జన కూడా సరిగా చేయలేరు. మరియు ఈ సమయంలో వచ్చే నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. అందుకే కిడ్నీల్లో రాళ్లును కరిగించడమో లేదా ఆపరేషన్ చేయించుకుని తీయించుకోవడమో చేస్తుంటారు. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. సోడియం అధికంగా ఉన్న ఆహారం ఎప్పుడూ తీసుకోకూడదు. ఎందుకంటే.. అలాంటి ఆహారం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. అలాగే యూరిక్‌ ఆసిడ్ ఎక్కువగా ఉన్న వారు మాంసాహారాన్ని అధికంగా తీసుకోరాదు. అలా తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారు వారానికి కేవలం ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే మాంసాహారాన్ని తీసుకోవాలి. చాక్లెట్లలో చిన్నదైనా, పెద్దదైనా… ఏదైనా సరే.. అందులో ఉండే ఆక్సలేట్ కిడ్నీసమస్యలను మరింత పెంచుతుంది. అందుకే చాక్లెట్లకు దూరంగా ఉండాలి. చాక్లెట్లను ఎక్కువగా తింటే… కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు తప్పవు. మనందరం రోజూ టమాటాలను వాడుతాం. టొమాటో గింజల్లో ఆక్సలేట్ ఉంటుంది. ఇది ఆహారానికి టేస్టును ఇస్తుంది. అదే సమయంలో… కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. టమాటాలను రోజూ వాడినా ఇబ్బందే. చాలా మంది సప్లిమెంట్ల రూపంలో కాల్షియం తీసుకుంటుంటారు. కానీ, ఇలా అవసరమైన దానికంటే అధికంగా తీసుకున్నా కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడతాయి. అంతేకాదు, విటమిన్ డి ఎక్కువగా తీసుకున్నా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. మరియు చిరుతిండ్లు, ఫాస్ట్ ఫుడ్‌, బేకరీ ఫుడ్స్, శీతల పానీయాలు వంటివి తీసుకోవడం కూడా కిడ్నీల్లో స్టోన్స్ రావడానికి కారణం. కాబట్టి, ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది. కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు నీరు ఎక్కువగా తీసుకోవాలి. నీరు మాత్రమే కాదు మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి కూడా తీసుకోవాలి. అలాగే కిడ్నీ బీన్స్, మెంతులు, తులసి ఆకులు, దానిమ్మ, ఆపిల్ సైడర్ వినెగర్ వంటివి తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయి. అలాగే నిమ్మ, బత్తాయి, కమలా వంటి నిమ్మ జాతి పండ్లను కూడా తీసుకోవాలి. ఎందుకంటే, వీటిలో నుంచి వచ్చే సిట్రేట్‌ కిడ్నీల్లో రాళ్లను తగ్గిస్తాయి. సముద్ర చేపలు, ఇతర ఆహారాలు డైలీ తింటే… యూరిక్ యాసిడ్ ఎక్కువగా బాడీలో చేరుతుంది. అది కాస్తా కిడ్నీల్లోకి వెళ్లి రాళ్లుగా మారేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల ఆహారల విషయంలో జాగ్రత్తలు పాటించటం అవసరం.. అదే పనిగా తినకుండా అవసరం ఉన్నప్పుడు వాటిని తీసుకోవటం మంచిది. ఇలా చేయటం వల్ల కీడ్నీ సమస్యలతోపాటు, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడే పరిస్ధితి నుండి బయటపడవచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ